కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది న‌రేంద్ర మోడీ స‌ర్కార్.. క‌రోనావైర‌స్‌తో ప్రతికూల పరిస్థితులు ఏర్ప‌డిన ఈ త‌రుణంలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. వారికి ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని ప్ర‌క‌టించింది కేంద్రం.. రెగ్యులర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేసేంత వరకు ఈ విధంగా పెన్షన్ అందిస్తామని వెల్ల‌డించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ప్రభుత్వ ఉద్యోగులు హెడ్ ఆఫీస్‌లో పెన్షన్ ఫామ్స్‌ను సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయ‌న‌.. సర్వీస్ బుక్‌తో కలిపి క్లెయిమ్ ఫామ్‌ను పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌లో సరైన టైమ్‌కు అందించలేకపోతున్నార‌న్నారు.. అందుకే ప్రొవిజనల్ పెన్షన్ ఫెసిలిటీ అందిస్తున్నామని స్ప‌ష్టం చేశారు. 

ఇక‌, న‌రేంద్ర మోడీ స‌ర్కార్ వచ్చిన త‌ర్వాత పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ డిపార్ట్‌మెంట్ అప్‌గ్రేడ్ అయ్యింద‌ని.. ఉద్యోగులు పదవీ విరమణ చేసే రోజునే వారికి పీపీవో అందిస్తున్నామని తెలిపారు జితేంద్ర‌ర సింగ్.. అంతేకాదు మోడీ.. డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రత్యేక పోర్టల్‌ కూడా ఆవిష్కరించామని తెలిపారు. పదవీ విరమణకు దగ్గరిలో ఉన్న వారు వారి పెన్షన్ పేపర్ల స్టేటస్‌ను వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించామ‌ని.. అయితే, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆఫీస్ వర్క్ ఆగిపోయిందని వివ‌రించారు.. అందుకే, ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి పీపీవో ఆర్డర్లు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పెన్షన్ ఆలస్యం కాకూడదనే లక్ష్యంతో ప్రొవిజనల్ పెన్షన్ అందించేందుకు రెడీ అయ్యామని చెప్పారు.