కదలించిన ప్రఖ్యాత చెఫ్‌ వికాస్‌ ఖన్నా ట్వీట్స్‌

కదలించిన ప్రఖ్యాత చెఫ్‌ వికాస్‌ ఖన్నా ట్వీట్స్‌

 

ఇతనే వికాస్‌ ఖన్నా.. ప్రఖ్యాత చెఫ్‌. మనదేశ మాస్టర్‌ ఛెఫ్‌  షో నిర్వాహకుడు. అమెరికా అధ్యక్షునిగా భారత్‌ వచ్చిన బరాక్‌ ఒబామాకు ప్రత్యేక వంటలు తయారు చేసిన నలభీముడు. ఈ ట్వీట్స్‌ చదివేముందు ఈ వీడియో చూడండి.

 

అనుపమ్‌ ఖేర్‌తో వికాస్‌ ఖన్నా అన్నదేమిటంటే...

"26 ఏళ్ళ క్రితం అంటే 1992లో మత కల్లోలాలతో అట్టుడుకుతున్న ముంబైలో అపుడు వికాస్‌ ఖన్నా ఓ హోటల్‌లో పనిచేసేవాడు. దొమ్మీలు, గొడవలు, దహనకాండలు జరుగుతుండటంతో సిబ్బంది మొత్తం హోటల్‌లోనే ఉండిపోయారు. అయితే వికాస్‌ ఖన్నా ఘట్‌కోపర్‌లో ఉండేవాడు. కొద్దిసేపటి ఘట్‌కోపర్‌లో గృహ దహనాలు జరిగాయని వార్తలు రావడంతో హోటల్‌ నుంచి పారిపోయి... రోడ్డుపైకి వచ్చాడు వికాస్‌ ఖన్నా. ఓ లారీలో ప్రయాణించి ఖార్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి  ఘట్‌కోపర్‌కు నడచి వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళాక.. ఎదరు పెద్ద గుంపు తనపైకి వస్తోంది. ఏం  చేయాలో  అర్థం కాలేదు వికాస్‌ ఖన్నా.ఇంతలో ఓ ముస్లిం కుటుంబం అతన్ని వెంటనే తమ ఇంట్లోకి లాక్కుంది. ఎందుకు ఇక్కడ ఉన్నావని అడుగుతోంది.. ఇంతలోని గుంపు ఇంటికి వచ్చి ఎవరు ఈ అబ్బాయని అడిగింది. తమ  అబ్బాయేనంటూ ఇంటి యజమాని అబద్ధమాడారు. యజమాని మాటలతో  వారు వెళ్ళిపోయారు. అలా అల్లరి మూకల ఉంచి ఒకటిన్నర రోజులు వారి ఇంట్లో ఉన్నారు. ఇంటి యజమాని తన అల్లుడిని ఘట్‌కోపర్‌కు పంపి తన అన్న అడ్రస్‌ కనుక్కున్నాడు. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యుల కోసం రంజాన్‌ మాసంలో ఒక రోజు ఉపవాసం ఉంటాన"ని చెప్పాడు వికాస్‌ ఖన్నా...

ఆ తరవాత ఈనెల 11వ తేదీన ఖన్నా పోస్ట్‌ చేసిన ట్వీట్‌ ఇది...

 

ఆ తరవాత కొద్దిసేపటికి చేసిన ట్వీట్స్‌ ఇవి... 

 

 

సో... అలా 26 ఏళ్ళ క్రితం తన ప్రాణాలు కాపాడిన కుటుంబ సభ్యుతో కలసి ఢిల్లీలోని జామా మసీదు వద్ద ఆరోజు ఉపవాసాన్ని పూర్తి చేశారు వికాస్‌ ఖన్నా. మొత్తానికి ఆ కుటుంబాన్ని వికాస్‌ కనుగొన్నాడన్నమాట.