పోతిరెడ్డి పాడు విషయంలో జగన్ సర్కార్ కు టీడీపీ మద్దతు  

పోతిరెడ్డి పాడు విషయంలో జగన్ సర్కార్ కు టీడీపీ మద్దతు  

పోతిరెడ్డిపాడు వివాదంలో రాష్ట్రం హక్కులు  కాపాడుకునేలా .. ప్రభుత్వం వ్యవహరించాలన్నారు ఏపీ విపక్షనేత చంద్రబాబు. తెలంగాణ భూభాగం నుంచి నీటి తరలింపు .. భవిష్యత్తులో ఇబ్బందులు తీసుకొస్తుందని.. ఆనాడే అసెంబ్లీలో చెప్పానని గుర్తు చేశారు చంద్రబాబు. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.  అసలు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసిందే తెలుగుదేశం ప్రభుత్వమన్నారు చంద్రబాబు. జగన్‌కు ప్రాజెక్టులంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలన్నారు. ఈ విషయంలో టీడీపీ పూర్తి మద్దతిస్తుందన్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల స్ఫూర్తికి తూట్లు పొడిచిందని విమర్శించారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.  దేశంలో ఎక్కడా లేని విధంగా తాము విద్యుత్ సంస్కరణలు చేపడితే...వైసీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ శ్లాబులు మార్చేశారని దుయ్యబట్టారు.  రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఏపీ విపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. లాక్‌ డౌన్ అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి , భయబ్రాంతులకు  గురిచేస్తున్నారని ఆరోపించారు.ఎల్జీ పాలిమర్స్  నుంచి అనేక అంశాల్లో దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. రాష్ట్రానికి తానే మొదటి, చివరి ముఖ్యమంత్రి అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారన్నారు చంద్రబాబు.