పీఎన్‌బీ స్కాం: ఏ1గా నీరవ్ మోడీ

పీఎన్‌బీ స్కాం: ఏ1గా నీరవ్ మోడీ

పీఎన్‌బీ కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రముఖ నగల వ్యాపారి నీరవ్ మోడీ, పీఎన్‌బీ అధికారుల‌ు, ఇతర సిబ్బందిపై తొలి ఛార్జీ షీటును నమోదు చేసింది. వీరిలో నీరవ్‌ను ఏ1గా చేర్చింది. తన ఛార్జీషీటును ముంబై కోర్టులో దాఖలు చేసింది. నీరవ్‌తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ సీఎండీ.. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్రహ్మాజీరావు, సంజీ శరణ్‌ జనరల్ మేనేజర్ నెహల్ అహాద్ తదితరులను ఛార్జీషీటులో చేర్చింది. వీరంతా నిబంధనలకు విరుద్ధంగా 400 కోట్ల రూపాయలు తప్పుడు ఎల్‌ఓయూలు జారీ చేశారని సీబీఐ తన ఛార్జీ షీటులో పేర్కొంది.