ఇందిరమ్మ ఇళ్ళ స్కామ్‌పై చార్జ్‌షీట్‌?

ఇందిరమ్మ ఇళ్ళ స్కామ్‌పై చార్జ్‌షీట్‌?

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇందిరమ్మ ఇళ్ళ కుంభకోణంపై రాష్ట్ర సీఐడీ త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళలో బోగస్‌ల సంఖ్య అధికంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ కి సీఐడీ లేఖ రాసినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇల్లు  నిర్మాణం, అందులో చోటు చేసుకున్న అవకతవకలపై స్పష్టత రావాల్సి ఉందని సీఐడీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదిక వచ్చాక.. దీనిపై క్లారిటీ వస్తుందని.. వాటిని పరిశీలించాక చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సీఐడీ  భావిస్తోంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాలో 36 గ్రామాల్లో అవినీతి జరిగినట్లు సమాచారం. సుమారు 3 వేల ఇళ్ల నిర్మాణంలో గోల్ మాల్ జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఇళ్ళ నిర్మాణంలో రూ.11  కోట్ల నిధులు పక్క దారి పట్టినట్టు సీఐడీ భావిస్తోంది.

Photo: FileShot