కళాకారులకు ఐడీ కార్డులు ఇవ్వాలి..

కళాకారులకు ఐడీ కార్డులు ఇవ్వాలి..

కళాకారులందరికీ ఐడీ కార్డులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇవాళ ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో రామతీర్థ సాగర్ ముంపు బాధితులతో, వృద్ధి కళాకారులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకున్నారు. రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని... నష్టపరిహారం సరిగా లేదని పలువురు రైతులు, గ్రామస్తులు ఆయనకు తెలియజేశారు. అలాగే తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. బతుకు తెరువు కష్టంగా ఉందని పలువురు సాంస్కృతిక కళాకారులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న కళలు ప్రపంచంలో ఎక్కడా లేవని.. కళల పరిరక్షణ కోసం ప్రత్యేకదృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు వ్యవసాయ కూలీలు వ్యవసాయంతో పాటుగా ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం లక్ష్మీనారాయణ గ్రామస్తులు చేసిన కత్తిసామును ఆసక్తిగా తిలకించి.. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.