మహేష్ భట్ , ఆలియా భట్‌పై  పోలీస్ కేసు !!

మహేష్ భట్ , ఆలియా భట్‌పై  పోలీస్ కేసు !!

బాలీవడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్ ఆమె తండ్రి మహేష్ భట్ పైన కూడా నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. కాగా తాజాగా స‌డ‌క్-2 పోస్ట‌ర్ పై కేసు నమోదు అయింది. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉందంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్‌తో పాటు నిర్మాత‌ ముఖేశ్ భ‌ట్, న‌టి ఆలియా భ‌ట్‌పై సెక్ష‌న్ 120బీ, 295ఏ కింద సికంద‌ర్‌పూర్‌కు చెందిన ఆచార్య‌చంద్ర కిషోర్ అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. 1991 సంవ‌త్స‌రంలో విడుద‌లైన ‘స‌డ‌క్’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వం వహిస్తూ కూతురు ఆలియాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.