వివాదాస్పద ఎమ్మెల్యేపై కేసు

వివాదాస్పద ఎమ్మెల్యేపై కేసు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేశారు. ఖురాన్‌ను నిషేధించాలి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నరికేయాలన్న ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నారు. రాజాసింగ్‌ నిన్న ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని నరికేయాలని అన్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్న 'ఆ పుస్తకాన్ని' నిషేధించాలంటూ ఖురాన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్‌కు కొత్తకాదు. ప్రతి హిందువు తన ఇంట్లో ఖడ్గాన్ని సిద్ధం చేసుకోవాలని, మత వ్యతిరేకులపై అవసరం ఏర్పడినప్పుడు ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని గతంలోనూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరతీశారు.