కెనెడా బ్యాంకులపై సైబర్‌ దాడులు

కెనెడా బ్యాంకులపై సైబర్‌ దాడులు

సైబర్‌ దాడులు మళ్ళీ ఉధృతమౌతున్నాయి. కెనెడాకు చెందిన అతిపెద్ద బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ మాంట్రియల్‌  కెనడియన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌పై సైబర్‌దాడులు జరిగారు. ఈ రెండు బ్యాంకులకు చెందిన సుమారు 90,000 మంది ఖాతాదారుల డేటాను హ్యకర్లు దొంగలించారు. ఈ స్థాయిలో బ్యాంకులపై దాడులు జరగడం కెనాడలో ఇదే మొదటిసారి.బ్యాంక్‌ ఖాతాదారుల సమాచారం తమ వద్ద ఉందంటూ హ్యాకర్లు తమకు ఫోన్‌ చేసిన మాట నిజమేనని బ్యాంక్‌ ఆఫ్‌ మాంట్రియల్‌ పేర్కొంది. వారితో బ్యాంక్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ బ్యాంకుకు చెందిన 50వేల మంది ఖాతాదారుల అకౌంట్లు హ్యాక్‌ అయినట్లు బ్యాంక్‌ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే ఖాతాదారుల అకౌంట్స్‌ నుంచి సొమ్ము విత్‌డ్రా చేశారా అన్న అంశంపై మాట్లాడేందుకు  ఆమె నిరాకరించారు.