కరోనా ఎఫెక్ట్ : ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు నో చెప్పిన కెనడా...

కరోనా ఎఫెక్ట్ : ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు నో చెప్పిన కెనడా...

కరోనావైరస్ ప్రపంచం అంత వ్యాప్తి చెందుతున్న సమయం లో నిర్వహిస్తున్న 2020 ఒలంపిక్స్ లో టీమ్ కెనడా ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడలలో పాల్గొనేందుకు నో చెప్పాయి కెనడియన్ ఒలింపిక్ కమిటీ (సిఓసి) మరియు పారాలింపిక్ కమిటీ (సిపిసి) . జూలైలో ఒలంపిక్ క్రీడలను నిర్వహించడానికి వ్యతిరేకత గత 48 గంటల్లో బాగా పెరిగింది. యు.ఎస్. ట్రాక్ అండ్ ఫీల్డ్ మరియు యుకె అథ్లెటిక్స్ వంటి అనేక ప్రధాన వాటాదారులు అనేక జాతీయ ఒలింపిక్ కమిటీలు ఈ కరోనా వైరస్ కారణంగా ఒలంపిక్స్ ను వాయిదా వేయాలని కోరాయి. కరోనావైరస్ తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 13,000 మందికి పైగా మరణించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి), మరియు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపిసి) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థలను ఒలంపిక్స్ క్రీడలు ఒక సంవత్సరం పాటు వాయిదా వేయాలని సిఓసి, సిపిసి సంయుక్తం గా పిలుపునిచ్చాయి. అయితే నిన్న జరిగిన ఒలంపిక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం లో క్రీడలు వాయిదా వేయడం పై చర్చించారు. అయితే ఈ విషయం పై సమావేశం నిర్వహించి 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ ఆదివారం చెప్పారు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది.