షాకింగ్ న్యూస్: సెక్స్ ద్వారా కరోనా... శాస్త్రవేత్తల సంచలన పరిశోధన... కానీ...!!

షాకింగ్ న్యూస్: సెక్స్ ద్వారా కరోనా... శాస్త్రవేత్తల సంచలన పరిశోధన... కానీ...!!

కోవిడ్ 19 వైరస్ పై శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు చేస్తున్నారు.  వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనే విషయాలపైన జరుగుతున్న పరిశోధనల్లో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.  ఎప్పటి కప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతో దీనికి ఎలాంటి మెడిసిన్ తయారు చెయ్యొచ్చు అనేది నిర్ధారణ చెయ్యొచ్చు.  

కరోనా మహమ్మారి పట్టుకున్న వస్తువులను తాకినప్పుడు కరోనా ఆ వస్తువునుంచి కొత్త వ్యక్తికి సోకుతుంది.  ఇది కళ్ళు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆ భాగాన్ని డ్యామేజ్ చేస్తుంది.  శ్వాస వ్యవస్థను దెబ్బ తీయడమే దీని ముఖ్య లక్షణం.  ఈ దిశగానే ఇప్పటి వరకు పరిశోధనలు జరుగుతూ వచ్చాయి.  అయితే, ఇటీవల రక్తం, మలం, కన్నీళ్ల వంటి ద్రవాల్లో ఈ కరోనా వైరస్ ను కనుగొన్నట్టుగా వార్తలు రావడంతో పరిశోధనలు మరింత ముమ్మరం చేశారు.  ఇక జికా, ఎబోలా వైరస్ లు మనిషి నుంచి మనిషికి లైంగికంగా సంక్రమించే అవకాశం ఉన్నట్టుగా అధరాలు కనుగొనడంలో ఈ దిశగా చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.  వీరి పరిశోధనల్లో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చినట్టు చైనాలోని జామా నెట్వర్క్ ఓపెన్ లో ప్రచురించారు.  

మనిషి వీర్యంలో కరోనా వైరస్ ను గుర్తించడంతో ఈ రకమైన అనుమానాలు మొదలయ్యాయి.  చైనాలోని హాస్పిటల్ లో చేరిన 38 మందిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్ ను వైద్యులు గుర్తించారు.  ఈ ఆరుగురిలో ఇద్దరు కోలుకున్నట్టు హాస్పిటల్ వర్గాలు చెప్తుండగా, నలుగురు చికిత్స పొందుతున్నారు.  వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించినా, ఇది లైంగికంగా ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఎంతవరకు ఉన్నది అనే విషయంపై లోతుగా పరిశోధన జరగాలని చైనాలోని ఉటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ హోటాలింగ్ పేర్కొన్నారు.  ఒకవేళ ఈ మహమ్మారి లైంగికంగా కూడా ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటె పరిస్థితి ఏంటి? దానిని ఎదుర్కొనడం ఎలా? ప్రస్తుతానికి ఇవి ప్రశ్నలే.  సమాధానం కోసం ఎదురుచూడాల్సిందే.