కాల్ సెంటర్ ఉద్యోగి ఆత్మహత్య

కాల్ సెంటర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ సనత్ నగర్ లో కాల్ సెంటర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. హైమావతి అనే యువతి ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. సహ ఉద్యోగి సాయి కృష్ణ ప్రేమించమని గత కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. ఈ విషయమై సాయిక్రిష్ణపై పోలీసులకు పిర్యాదు కూడా చేసింది. ఈమధ్య కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో హైమావతి సనత్ నగర్ లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న హైమావతిని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. సాయి కృష్ణ, అతని స్నేహితురాలు వేధింపులతో హైమవతి ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.