మహానటుడిగా 'ఎన్టీఆర్'

మహానటుడిగా 'ఎన్టీఆర్'
తెలుగులో మొదటి బయోపిక్ సినిమా మహానటి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.  గతంలో సావిత్రి జీవితం గురించి బయోపిక్ తీయాలని అనుకున్నా ఆచరణకు సాధ్యం కాలేదు.  ఎందరో అగ్ర నటులకు సాధ్యంకాని దాన్ని నాగ్ అశ్విన్ సాధించి చూపించాడు. శక్తి సినిమా తరువాత ఏడేళ్లపాటు వైజయంతి మూవీస్ సంస్థ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నది.  మహానటి సినిమాతో తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ సాధించింది.  ఈ సినిమా ఇచ్చిన విజయంతో తిరిగి సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.  
ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అయింది.  వైజయంతి మూవీస్, దిల్ రాజు సంస్థ సంయుక్తంగా మహేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తరువాత వైజయంతి మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  జూనియర్ తో సినిమా చేసేందుకు ఈ సంస్థ ఇప్పటికే ముగ్గురు దర్శకులను కలిసిందట. ఆ ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేస్తారు అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. వైజయంతి మూవీస్ లో జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాకు మహానటుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  
జై లవకుశ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో మెప్పించి మహానటుడిగా ప్రూవ్ చేసుకున్నాడని, ఎన్టీఆర్.. అశ్వినీదత్ సినిమాకు మహానటుడు అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని, ఆ టైటిల్ నే యూనిట్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తయ్యాక వైజయంతి మూవీస్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.