"బుట్ట బొమ్మ" సాంగ్ మరో రికార్డ్.!

"బుట్ట బొమ్మ" సాంగ్ మరో రికార్డ్.!

అల వైకుంఠపురం సినిమాలోని పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ముఖ్యంగా బుట్ట బొమ్మ పాటకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా విడుదలైన నాటి నుండి ఈ పాట రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా ఈ పాట మరో రికార్డు బద్దలు కొట్టింది. తెలుగు ఇండస్ట్రీలో 300 మిలియన్ ప్లస్ వ్యూవ్స్ వచ్చిన మొదటి పాటగా నిలిచింది. ఈ విషయాన్ని అల వైకుంఠపురం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక ఈ సాంగ్ కు టిక్ టాక్ లో సైతం ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ పాటకు స్టెప్పులేసి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది.