ఇల్లు కొనేవారికి మోడీ బంపర్‌ ఆఫర్‌

ఇల్లు కొనేవారికి మోడీ బంపర్‌ ఆఫర్‌

చాలా రోజుల తరవాత మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మీ వార్షిక ఆదాయం  రూ.18 లక్షలున్నా.. మీరు డబుల్‌ లేదా త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకున్నా... ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద భారీ వడ్డీ రాయితీ పొందొచ్చు. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజీ) కింద ఇల్లు కొనేవారికి రెండు గ్రూపుల కింద ప్రభుత్వ రాయితీ ఇస్తోంది. మీ వార్షిక ఆదాయం రూ. 6 నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండి..120 చదరపు మీటర్లు ఉండే ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే.. ఇప్పటి వరకు రూ. 2.35 లక్షల వరకు గరిష్ఠంగా సబ్సిడీ మొత్తం లభించేంది. అదే మీ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల నుంచి రూ.18 లక్షలు ఉండి 150 చదరపు మీటర్ల వరకు ఉండే ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే రూ. 2.3 లక్షల సబ్సిడీ లభించేంది. అయితే ఇపుడు ఈ సబ్సిడీ రాయితీని పెద్ద ఇళ్ళకు కూడా వర్తింపు చేశారు. అంటే మీ వార్షిక ఆదాయంలో ఎలాంటి మార్పు లేకున్నా... మొదటి కేటగిరి ఇంటి విస్తీర్ణం 160 చదరపు మీటర్లకు, రెండో కేటగిరి విస్తీర్ణం 150 నుంచి 200 చదరపు మీటర్లకు పెంచారు. దీంతో పెద్ద ఇల్లు కొనుగోలు చేసినా సబ్సిడీ పొందొచ్చు. పెద్ద నగరాల్లో 160 లేదా 200 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాటు ప్రభుత్వం విధించిన పరిమితిలో దొరక్కపోయినా.. మధ్య, చిన్న తరహా పట్టణాల్లో లభిస్తాయని ప్రభుత్వం అంటోంది. నగరాల్లో కాకుండా మధ్య, చిన్న తరహా పట్టణాల్లో గృహ నిర్మాణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.