రామ్ - సత్తార్ మూవీకి బ్రేక్ పడిందా..?

రామ్ - సత్తార్ మూవీకి బ్రేక్ పడిందా..?

గుంటూరు టాకీస్, గరుడ వేగ సినిమాల తరువాత ప్రవీణ్ సత్తార్ మంచి ఊపుమీదున్నాడు.  గరుడ వేగ సినిమా విజయం తరువాత సత్తార్ కు వరసగా ఆఫర్లు వస్తున్నాయి.  రామ్ తో సినిమా కన్ఫర్మ్ అయింది.  రామ్ ఇప్పటి వరకు చేయని కథతో ఈ సినిమా ఉంటుంది.  కథ మొత్తం ఇండియా - చైనా బోర్డర్ లో జరుగుతుంది.  ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు రాలేదు.  

రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో సినిమా చేయడానికి ప్లాన్ రెడీ అయింది. కథ కథనాలు అన్ని అనుకున్నాక బడ్జెట్ విషయంలోనే స్రవంతి రవి కిషోర్ వెనకడుగు వేస్తున్నారు.  ఈ సినిమాకు సత్తార్ రూ.43 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని చెప్పాడు.  హీరో రామ్ కు అంత మార్కెట్ లేదు.  కథపై నమ్మకంతో రూ.30 కోట్ల వరకు బడ్జెట్ ఇచ్చేనందుకు స్రవంతి కిషోర్ ఓకే చెప్పాడట.  అయితే, ఇండియా చైనా బోర్డర్ లో జరిగే కథ కావడంతో ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  బడ్జెట్ కుదరకపోవడంతో.. సినిమాకు బ్రేక్ పడిందని తెలుస్తోంది.