కరోనా ఎఫెక్ట్... బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్...

కరోనా ఎఫెక్ట్... బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్...

బీఎస్ఎన్ఎల్ కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా కనెక్షన్లు తీసుకున్నవారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తుండగా, ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే అదేబాటలో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా తమకు మరిన్ని కొత్త కనెక్షన్లు వస్తాయని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ బ్రాడ్ బ్యాండ్ అంటూ సరికొత్త ప్లాన్ ప్రకటించింది. ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారు కొత్తగా బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కావాలనుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ స్పందిస్తూ, తమ కొత్త ప్లాన్ తో ఉద్యోగులు ఇంటి నుంచి బయటికి రాకుండానే పని చేసుకోవచ్చని అన్నారు. ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా వసూలు చేయబోమని, అయితే వినియోగదారులు ఇంటర్నెట్ మోడెమ్ ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారాయన.