బ్రిటన్ ప్రిన్స్ ఛార్లెస్‌ కు కరోనా..

బ్రిటన్ ప్రిన్స్ ఛార్లెస్‌ కు కరోనా..


కరోనా మహమ్మారి బ్రిటన్‌ను వణికిస్తోంది. రాజకుటుంబాన్ని సైతం కరోనా తాకింది.. బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా సోకింది. ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు క్లారెన్స్ హౌస్ ప్రకటించింది. ఇప్పటికైతే ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని ప్రకటించింది. ఆయన భార్య కామిలాకు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. అయితే ప్రిన్స్‌కు వైరస్‌ ఎలా సోకిందనేది చెప్పలేమని తెలిపింది. ఎందుకంటే ఇటీవలికాలంలో ఆయన పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించారు... అయితే ఇప్పటికే క్వీన్ ఎలిజబెత్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. రాయల్ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి క్వీన్ ఎలిజబెత్ బయటకు వెళ్లిపోయారు. ఆమెతో పాటు వర్కర్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసున్నారు. లండన్‌లోని ఆమె నివాసానికి చేరుకన్నారు. రాణి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. బ్రిటన్ లో ఇప్పటి వరకు 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా, 422 మంది ప్రాణాలు కోల్పోయారు. 135 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు.