దడ పుట్టిస్తున్న ముడి చమురు

దడ పుట్టిస్తున్న ముడి చమురు

మార్కెట్‌ ఊహించినట్లే ముడి చమురు ధరలు ఇవాళ కీలక స్థాయిని దాటాయి. 2014 నవంబర్‌ తరవాత బ్రెంట్‌ క్రూడ్‌ 80 డాలర్లను దాటడం ఇవాళే. అమెరికా నైమెక్స్‌ క్రూడ్‌ కూడా  దాదాపు ఒక శాతం పెరిగి 72 డాలర్లకు చేరింది. నిన్న రాత్రి వెలువడి అమెరికా వారపు చమురు నిల్వల డేటా బుల్లిష్‌గా ఉండటంతో ఉదయం నుంచి చుమరు ధరలు క్రమంగా పెరుగూ వస్తున్నాయి. యూరో మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే బ్రెంట్‌ 80 డాలర్లను దాటింది.  ఆసియా దేశాలు బ్రెంట్‌ క్రూడ్‌ను కొనుగోలు చేస్తాయి. సాధారణంగా డాలర్‌ బలహీనంగా ఉన్న సమయంలో చమురు ధరలు పెరుగుతాయి. లేదంటే రివర్స్‌. దీంతో భారత్‌ వంటి దేశాలపై ముడి చమురు భారం మరీ ఎక్కువగా ఉండదు. ఈసారి మాత్రం డాలర్‌ పెరుతున్నా... ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో రూపాయి బాగా బలహీనపడుతోంది. డాలర్‌కు రూపాయి విలువ 68పైన పడిపోవడంతో... ముడి చమురు దిగుమతులకు భారత్‌ భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.