రుతుపవనాల విస్తరణకు బ్రేక్‌ 

రుతుపవనాల విస్తరణకు బ్రేక్‌ 

మరో రెండు మూడు రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల విస్తరణ ఆగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 14వ తేదీ నుంచి వారం పాటు రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించి ఆ తర్వాత నెమ్మదిస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.