బ్రహ్మోత్సవం దర్శకుడు మరో మల్టీస్టారర్ చేస్తున్నాడా..?

బ్రహ్మోత్సవం దర్శకుడు మరో మల్టీస్టారర్ చేస్తున్నాడా..?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీస్టారర్ సినిమాను తీసి హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల.. ఆ తరువాత మహేష్ తో బ్రహ్మోత్సవం తీసి చేతులు కాల్చుకున్నాడు.  భారీ పరాజయం పాలవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ డైలమాలో పడింది. బ్రహ్మోత్సవం తరువాత చాలాకాలం శ్రీకాంత్ అడ్డాల ఖాళీగా ఉన్నారు.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఈ దర్శకుడు ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నాడట.  తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన మల్టీస్టారర్ కథనే మరలా సిద్ధం చేసుకున్నాడు.  ఈ కథతో గీతా ఆర్ట్స్ ని సంప్రదిస్తే.. సినిమా తీసేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం.  

మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒకరు శర్వానంద్ కాగా, రెండో వ్యక్తి ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  అన్నదమ్ముల కథతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఇందులో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారు.. ఎప్పుడు సినిమా ప్రారంభమవుతుందనే విషయాలు త్వరలోనే వెల్లడవుతాయి.