కేసీఆర్ కు షాక్ ఇచ్చిన బోస్టన్ గ్రూప్..లాక్ డౌన్ పొడిగించాలని మేం చెప్పలేదు!

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన బోస్టన్ గ్రూప్..లాక్ డౌన్ పొడిగించాలని మేం చెప్పలేదు!

లాక్ డౌన్ పొడిగింపు విషయంలో తమపై వస్తున్న తప్పుడు వార్తలను బోస్టన్ గ్రూప్ కండించింది. లాక్ డౌన్ పొడిగింపు పై తాము ఎటువంటి అంచనాలు వేయలేదని వస్తున్న కథనాలపై తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కొద్దీ రోజులనుండి భారత్ లో సరైన వైద్య సదుపాయాలు లేవని జూన్ వరకు లాక్ డౌన్ పొడిగిస్తేనే కరోనా ను అరికట్టగలరని అలా అని బీసీజీ తెలిపిందని సోషల్ మీడియా లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా నిన్న స్వయానా ముఖ్య మంత్రి గారే మీడియా ముందు చెప్పారు కూడా. లాక్ డౌన్ ను జూన్ 3 వరకు పొడిగిస్తే మంచిదని ఆ విషయం బోస్టన్ గ్రూప్ తెలిపిందని కేసీఆర్ అన్నారు. ఆ విషయాన్ని ప్రధానికి కూడా తెలియజేస్తానని అన్నారు. కాగా ఇప్పుడు బోస్టన్ గ్రూప్ తాము ఎలాంటి సమాచారం ఇవ్వ్వలేదని అలంటి వార్తలను ఎవరూ విశ్వసించవద్దని అనడం తో చర్చగా మారింది.