యూపీలో కలకలం.. సీఎం యోగికి బాంబ్ బెదిరింపు

యూపీలో కలకలం.. సీఎం యోగికి బాంబ్ బెదిరింపు

ఓ వాట్సాప్ మెసేజ్ ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్‌ను పోలీసులకు పంపించారు దుండగులు.. దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోద చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.. యూపీ పోలీసు ప్రధాన కార్యాలయం 'వాట్సాప్ నంబర్‌కు పంపిన సందేశంలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు.. అతడు సమాజానికి ముప్పుగా పేర్కొన్నట్టుగా ఓ సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాదు.. సీఎం యోగిని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించారని ఆ అధికారి వివరించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ సందేశం రావడంతో.. వెంటనే పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనపై గోమతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు... కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఇది ఆకతాయిల పనా? లేదా సీఎంపై కుట్ర జరుగుతుందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. వాట్సాప్ మెసేజ్‌ వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా.. ఆ నంబర్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.