ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్ !

ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్ !

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా గజగజ వణికిస్తుంది. చైనా లో పుట్టిన ఈ వైరస్ దాదాపుగా 195 దేశాలకు విస్తరించింది. అయితే ఈ వైరస్ ప్రభావం మన దేశం లో కూడా అధికంగా కనిపిస్తుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఉన్న 195 దేశాల్లో 24వ స్థానంలో ఇండియా ఉంది. కరోనా వైరస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలని కూడా వణికిస్తుంది. ఇప్పటికే హాలీవుడ్‌కి చెందిన అనేక మంది నటీనటులు , సింగర్ వైరస్ బారిన పడగా,తాజాగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎలాగోలా కనికా కరోనా నుంచి తప్పించుకుంది. ఐదు సార్లు ఆమెను పరీక్షించగా చివరిసారి కరోనా నెగిటివ్ వచ్చింది.  .ఇక బాలీవుడ్ ప్రముఖ నిర్మాత  కరీం మొరానీ కుమార్తెలకి కరోనా పాజిటివ్ రావడంతో బాలీవుడ్  ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తాజాగా కరీంకి కూడా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది.కమొరానీ కుమార్తెలు షాజా, జోవాలకి కరోనా పాజిటివ్ రావడంతో వారిద్దరిని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంకి కూడా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో, ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆయనకు కూడా పాజిటివ్ అని తేలింది.దాంతో బాలీవుడ్ జనాలు భయాందోళనకు గురవుతున్నారు.