గోదావరిలో మునిగిన లాంఛీ

గోదావరిలో మునిగిన లాంఛీ

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లాంఛీ మంటూరు దగ్గర గోదావరిలో మునిగిపోయింది. ఈ లాంఛీలో పెళ్లిబృందంతోపాటు మరో 30 మంది ఉన్నట్టు సమాచారం. పడవ మునిగాక కొంతమంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. లాంచీ నిర్వహకుడు దేవీపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లాంచీ లక్ష్మీవెంటేశ్వర సర్వీస్‌కు చెందినదని సమాచారం. నాటుపడవలో ప్రమాద స్థలికి వెళ్లి సాయం చేస్తున్న గిరిజనులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మిగతా ప్రయాణికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయల్దేరి వెళ్లాయి.