ఏపీలో మరో పడవ ప్రమాదం

ఏపీలో మరో పడవ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో మరో పడవ ప్రమాదం జరిగింది. తుళ్లూరు మండలం బోరుపాలెం వద్ద కృష్ణానదిలో రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి వస్తున్న పడవను.. ఇసుక బోటు ఢీకొట్టడంతో చేపల వేటకు వెళ్లొస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. తండ్రి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేయగా.. తల్లీ, కూతురు నదిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కొట్టుకుపోయిన వారి కోసం గాలిస్తున్నారు.