బీజేపీది సంఖ్యాపరమైన గెలుపు: యనమల

బీజేపీది సంఖ్యాపరమైన గెలుపు: యనమల

కర్ణాటకలో సంఖ్యాపరంగా మాత్రమే బీజేపీ గెలిచిందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దాదాపు 60 శాతానికి పైగా ప్రజలు బీజేపీని వ్యతిరేకించారని విమర్శించారు. బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఓట్ల శాతం పెరగలేదన్నారు. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 36 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని.. అందుకే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో  తెలుగు ఓటర్ల ఆగ్రహం స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు.