80 శాతం కాపులు పవన్ కల్యాణ్ వైపే...!

80 శాతం కాపులు పవన్ కల్యాణ్ వైపే...!

ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా రసవత్తరంగా మారింది. తెదేపా బీజేపీ మధ్య వార్ నీవా నేనా అన్న చందంగా జరుగుతుంది. తాజాగా ఏపీ బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు, మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. తెదేపా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని... బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకకు తెదేపా బృందాలను కర్ణాటకకు పంపిందని మాణిక్యాలరావు వెల్లడించారు. అంతాకాకుండా గతంలో కమ్మ సామాజిక వర్గం హోదా అక్కరలేదని తెలిపారని.. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ప్రత్యేక హోదా కావాలని కోరుతుందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం 80శాతం మంది కాపులు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారని ఆయన అన్నారు. కాగా ఈ విషయంపై మరింత సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.