హ్యాపీ బి-డే: హ‌లో గురూ.. హిట్టు కొడ‌తారా?

హ్యాపీ బి-డే: హ‌లో గురూ.. హిట్టు కొడ‌తారా?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. `దేవ‌దాస్` సినిమాతో రామ్ అప్పియ‌రెన్స్ స్కూల్‌, కాలేజ్ యూత్‌కి పిచ్చిగా న‌చ్చేసింది. ఎలాంటి బెరుకు లేకుండా న‌టించ‌డం రామ్ ప్ర‌త్యేక‌త‌. డ్యాన్సులు, ఫైట్స్‌లోనూ అత‌డి ఎన‌ర్జీ హైపిచ్‌లో ఉంటుంది. తొలి సినిమాతోనే అత‌డికంటూ ఓ ఫాలోయింగ్ ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మిదే. అయితే కెరీర్ ప‌రంగా .. రామ్ చేసిన కొన్ని త‌ప్పిదాలు అత‌డికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తెచ్చాయ‌నే చెప్పాలి. కొన్ని వ‌రుస ఫ్లాప్‌ల త‌ర‌వాత‌ ఇటీవ‌ల `నేను శైల‌జ‌` చిత్రంతో కంబ్యాక్ అయిన రామ్.. ఆ త‌ర‌వాత `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` చిత్రంలో చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ ఫ‌లితం ఆశించిన స్థాయిలో ద‌క్క‌లేదు. దాంతో కీల‌క‌మైన స‌మ‌యంలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ కోసం ఎంతో త‌ప‌న‌తో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రంలో న‌టిస్తున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీద ఉన్న త్రినాధ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నాయిక‌గా న‌టిస్తోంది. రామ్ స్టైల్‌, ఎన‌ర్జీకి త‌గ్గ స్క్రిప్టుతో ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ఒకే ఒక్క హిట్టు కోస‌మే ఈ త‌ప‌న‌. ఆ ఒక్క హిట్టుతో మ‌రోసారి రామ్ కెరీర్ వేగం పుంజుకుంటుంద‌నే ఆశిద్దాం. నేడు రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.