లాక్ డౌన్ ఎఫెక్ట్:  పోలీసులకే షాకిస్తున్నారుగా...!!!

లాక్ డౌన్ ఎఫెక్ట్:  పోలీసులకే షాకిస్తున్నారుగా...!!!

లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, బయటకు రాకుండా 21 రోజులు ఇంట్లోనే ఉంటె ఖచ్చితంగా వైరస్ పై విజయం  సాధించవచ్చు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి.  దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు నియమాలను ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తున్నాయి.  కానీ, కొంతమంది ఆకతాయిలు మాత్రం వీటిని పట్టించుకోకుండా రోడ్డుమీదకు వస్తున్నారు.  

సరైన కారణం లేకుండా రోడ్డు మీదకు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పటికే ప్రభుత్వం వివరించి చెప్తున్నది.  కానీ, యువత మాత్రం వినడం లేదు.  ఆ ఏం చేస్తారులే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.  రోడ్డుమీదకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు.  పోలీసులు ఆపి అడిగితె,  పొంతన లేని విషయాలు చెప్తూ అక్కడి నుంచి తప్పించుకుపోతున్నారు.  కొంతమంది చెప్తున్న సమాధానాలు విని పోలీసులు సైతం షాక్ అవుతున్నారు.  ఫ్రెండ్ తప్పిపోయాడని, బంధువులకు బాగాలేదని, ఎమర్జెన్సీ అని చెప్పి రోడ్డు మీదకు వస్తున్నారు.  ఇంకొందరైతే రోడ్లు ఖాళీగా ఉన్నాయని లాంగ్ డ్రైవ్ చేయడానికి వచ్చామని చెప్పి పోలీసులకు షాక్ ఇస్తున్నారట.    దీంతో పోలీసులు కూడా కొంచం కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుందని లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుందని అంటున్నారు.