*`బిగ్‌బాస్-2` సెల‌బ్‌ జాబితా లీక్‌

*`బిగ్‌బాస్-2` సెల‌బ్‌ జాబితా లీక్‌

ఎన్టీఆర్ హోస్ట్‌గా `బిగ్‌బాస్‌` సీజ‌న్- 1 పెద్ద స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. సీజ‌న్- 2కి ప్ర‌స్తుతం స‌న్నాహాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌- అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో బిగ్‌బాస్ సెట్ నిర్మాణం దాదాపు పూర్త‌యింద‌ని తెలుస్తోంది. ఈ సెట్‌లోనే మొత్తం సీజ‌న్- 2కి సంబంధించిన అన్ని ఎపిసోడ్ల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఓవైపు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ బిగ్‌బాస్- 2 హోస్ట్ ఎవ‌ర‌న్న‌ది ప్ర‌క‌టించ‌లేదు. ఈసారి బిగ్‌బాస్‌కి నేచుర‌ల్‌స్టార్ నాని హోస్టింగ్ చేస్తార‌న్న ప్ర‌చారం ఉన్నా.. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉందింకా.

ఈ కొత్త సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు పార్టిసిపేట్ చేస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చింది. ఆర్జీవీ `ఐస్‌క్రీమ్‌`లో అందాల ఆర‌బోత‌తో వేడెక్కించిన తెలుగ‌మ్మాయ్ తేజ‌స్వి మ‌దివాడ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వ‌నుంది. న‌వ‌త‌రం గాయ‌ని గీతా మాధురిని ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ నాయిక రాశీ ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారారు. త‌ను కూడా బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇస్తున్నారట‌. ఎన్టీఆర్ స‌ర‌స‌న స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో తెరంగేట్రం చేసిన గ‌జాలాను బుల్లితెర‌పై వీక్షించే ఛాన్సుంది. యాంక‌ర్ శ్యామ‌ల‌ను ఓ పార్టిసిపెంట్‌గా ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. 

Photo: FileShot