హైదరాబాద్ లో ఆడటం వలెనే ఇప్పుడు ఇలా ఉన్నాను ; భువీ 

హైదరాబాద్ లో ఆడటం వలెనే ఇప్పుడు ఇలా ఉన్నాను ; భువీ 

ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ భారత జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో అందరికి తెలుసు. ఆట మొదట్లో అలాగే చివర్లో  వికెట్లు తీయగల భువీ గత ఏడాది ఆగస్టు నుండి గాయం కారణంగా క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో  భువీ మాట్లాడుతూ... నేను ఇప్పుడు ఇలా ఉండటానికి గల కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడటమే. ఆ జట్టు తరపున ఆడటం ప్రారంభించినప్పటి నుండే నా ఆటలో మార్పు వచ్చింది. నేను క్రికెట్ ప్రారంభించినప్పటి నుండి నా బలం యార్కర్. అయితే మ్యాచ్ మొదట్లో వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత దాని పై పట్టు కోల్పోయేవాడిని. దాంతో  డెత్‌ ఓవర్లలో అంతగా ప్రభావం చూపించేవాడిని కాదు. కానీ ఈ జట్టులోకి వచ్చినప్పటి నుండి ఆ డెత్‌ ఓవర్లలోనే ఎక్కువగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. దాని వల్ల నాకు చాల లాభం జరిగింది. మ్యాచ్ ఆఖర్లో ఏ విధంగా బౌలింగ్ చేయాలి అనేదానిపై నేను  పట్టు సాధించాను అని తెలిపాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున 2014 నుంచి ఆడుతున్న భువనేశ్వర్ అప్పటినుండి జరిగిన 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు తీసుకున్నాడు.