ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకుంటా : హీరోయిన్

ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకుంటా : హీరోయిన్

సినిమా తారలకు సోషల్  మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు . కొన్ని సార్లు సోషల్ మీడియా ద్వారా చేదు అనుభవాలు  కూడా ఎదురవుతుంటాయి. తాజాగా బోజ్ పురి హీరోయిన్ రాణి చటర్జి తనకు ఎదురు అవుతున్న సోషల్ మీడియా వేదింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న ధనుంజయ్ సింగ్ అనే వ్యక్తి అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను ముసలిదాన అంటూ సంభోదిస్తూ అతడు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. ఒకానొక సమయంలో అతడి వల్ల డిప్రెషన్ కు వెళ్తున్నాను. ఆ సమయంలో నాకు ఆత్మహత్య తప్ప మరే మార్గం లేదు అన్నట్లుగా అనిపిస్తుందని  ఆమె తెలిపింది. మొదట్లో వాటిని పట్టించుకోకూడదు అనుకున్నాను కానీ  అతను మరీ నీచంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.  బ్లాక్ చేసినా ఇంకా అతడి నుండి ఎంత దూరంగా ఉన్నా కూడా అతడు మాత్రం నన్ను వదిలి పెట్టడం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అతడి నుండి తనను కాపాడకుంటే  నేను ఏ క్షణంలో అయినా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.