భ‌ర‌త్ లెక్క‌ల్లో వాస్త‌వం తెలిస్తే?

భ‌ర‌త్ లెక్క‌ల్లో వాస్త‌వం తెలిస్తే?

హైప్ కోసం .. ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం కోసం లెక్క‌ల్లో ఎక్కువ చేసి చెప్ప‌డం అన్న‌ది అనాదిగా ఉన్న ఆచార‌మే. అయితే మాట‌లు కోట‌లు దాటి ఏకంగా 200 క్ల‌బ్ కోసం పాకులాడ‌డం మాత్రం స‌రికాద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం `భ‌ర‌త్ అనే నేను` రికార్డుల మోత గురించి ట్రేడ్‌లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికి 192కోట్ల వ‌సూళ్లు సాధించింది అంటూ ప్ర‌చారం సాగింది. అయితే ఇందులో వాస్త‌వ‌మెంత‌? అంటే ఎవ‌రికీ తెలీని స‌న్నివేశం. 

అయితే పంపిణీదారుల స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేసి ఏరియా వైజ్ భారీ రేట్ల‌కు హ‌క్కులు విక్ర‌యించారు. దాంతో ఇప్ప‌టికీ(13రోజుల‌కు) కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించ‌లేద‌ని డిస్ట్రిబ్యూట‌ర్ల రిపోర్ట్ అందింది. నైజాం 22 కోట్ల‌కు కొంటే 17 కోట్లు మాత్రమే వ‌సూలైంది.. సీడెడ్ 12కోట్ల‌కు కొంటే 9 కోట్లు వ‌సూలు చేసింది. నెల్లూరు 3కోట్ల‌కు కొంటే 2.4కోట్ల షేర్ వ‌సూలైంది. వైజాగ్ 8.2కోట్ల‌కు కొంటే 8కోట్లు వ‌సూలై సేఫ్ అయ్యింది. తూ.గో జిల్లాకు 6.7కోట్ల‌కు కొంటే 6.35 కోట్ల‌తో ఫ‌ర్వాలేద‌నిపించింది. ప‌.గో జిల్లా పంపిణీదారుకు మాత్రం పంచ్ ప‌డింది. అక్క‌డ 3.9కోట్ల‌కు కొనుక్కుంటే భారీగా న‌ష్టాలు త‌ప్ప‌లేదట‌. అక్క‌డ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకో 2కోట్లు వ‌సూలు చేయాల‌ట‌. ఒక్క గుంటూరు మాత్రం 13 కోట్ల‌కు కొంటే, అక్క‌డ బాగానే లాభాలొచ్చాయి. ఓవ‌ర్సీస్ 16కోట్ల‌కు కొన్నారు. అది ఇప్ప‌టికే సేఫ్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈ వారంలో 100 కోట్ల షేర్ మార్కును అందుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.