భానుకిరణ్‌కు ఏడాది జైలు

భానుకిరణ్‌కు ఏడాది జైలు

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2009లో అక్రమంగా ఆయుధాలు వినియోగించినట్టు కోర్టు నిర్ధారించింది. భాను కిరణ్‌తో పాటు రాజశేఖర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, వినోద్ లకు కోర్ట్ ఏడాది శిక్ష.. 10  వేల ఫైన్ విధించింది. 2009 మార్చ్ 11న బేగంపేటలో ఆయుధాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డారు భాను గ్యాంగ్. వీరివద్ద 8 పిస్టళ్లు,12 తపంచాలు, 42 బుల్లెట్లు,12 మ్యాగజైన్స్ మరియు ఒక ఫోన్ దొరికింది. ఈ కేసును సీఐడీకి ట్రాన్స్ఫర్ చేసారు హైదరాబాద్ పోలీసులు. 9 ఏళ్ల పాటు విచారణ కొనసాగిన తర్వాత చివరకు తీర్పు వెలుపడింది.