కీపర్‌పై సస్పెన్షన్‌ వేటు...

కీపర్‌పై సస్పెన్షన్‌ వేటు...

పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ గుప్తా(27)పై సస్పెన్షన్‌ వేటు పడింది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బీసీసీఐ 8 నెలల పాటు సస్పెన్షన్‌ వేటు వేసింది. కీపర్‌ అభిషేక్‌ గుప్తా నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్‌ తీసుకున్నట్లు డోపింగ్ పరీక్షల్లో స్పష్టమవడంతో సస్పెండ్‌ చేశారు. జనవరిలో నిర్వహించిన బీసీసీఐ డోపింగ్‌ పరీక్షల్లో అభిషేక్‌ గుప్తా యూరిన్ నమూనాలను సేకరించి టెస్ట్ చేయడంతో విషయం బయటపడింది. దాంతో గుప్తాపై 8 నెలల నిషేధం విధించింది. అయితే దగ్గు టానిక్‌లో ఉండే ఉత్ప్రేరకాన్ని డాక్టర్‌ సూచన మేరకే తీసుకున్నట్లు అభిషేక్‌ వివరణ ఇచ్చాడు. దీంతో నిషేధాన్ని 8 నెలలకే పరిమితం చేసింది బీసీసీఐ. ఈ నిషేధం జనవరి 15వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 14 తేదీ వరకూ అమల్లో ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది.