భారత జట్టు ఆసీస్ పర్యటనకోసం ఆ పని చేయాల్సిందే : బీసీసీఐ

భారత జట్టు ఆసీస్ పర్యటనకోసం ఆ పని చేయాల్సిందే : బీసీసీఐ

భారతదేశం రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ), బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ఉన్నతాధికారుల నుండి సానుకూల స్పందన వచ్చింది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్‌లో టీ 20 ట్రై-సిరీస్‌తో ప్రారంభమవుతుంది మరియు డిసెంబర్‌లో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ముగుస్తుంది. అయితే ఈ పర్యటన పై అందరికి అనుమానాలు ఉన్నాయి. ఇక ఈ విషయం పై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ, భారత క్రీడాకారులు ఆస్ట్రేలియాలో 14 రోజుల పాటుగా స్వీయ నిర్బంధం లోకి వెళ్తేనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసీస్ పర్యటన అధికారికంగా ప్రారంభమవుతుంది అని ధుమల్ అన్నారు. అయితే ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ, భారత ఆస్ట్రేలియా పర్యటన తమకు ఆర్థికంగా 300 మిలియన్ డాలర్ల విలువైనదని, ఈ సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని అన్నారు. అయితే చూడాలి మరి మన ఆటగాళ్లు 14 రోజుల పాటుగా స్వీయ నిర్బంధం లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటారా... లేదా అనేది.