అలా అయితేనే వివో ఐపీఎల్ ఒప్పందం రద్దు... 

అలా అయితేనే వివో ఐపీఎల్ ఒప్పందం రద్దు... 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  చైనా సెల్ ఫోన్ సంస్థ అయిన వివో తో స్పాన్సర్షిప్ ఒప్పందం 2022 వరకు కుదుర్చుకుంది. అయితే గత నెలలో  లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు  మరణించడం తో అందరూ చైనా వస్తువులను బహిష్కరించాలని ఐపీఎల్ కూడా ఆ చైనా  కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని అభిమానులు  బీసీసీఐని కోరారు. అప్పుడు ఈ విషయం పై  సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ అధికారులు తెలిపారు. అయితే ఆ సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదు. ఇక ఈ విషయం పై తాజాగా స్పందించిన ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... "ఎగ్జిట్ క్లాజ్" చైనా సెల్ ఫోన్ సంస్థకు అనుకూలంగా ఉంటే మాత్రం బీసీసీఐ  ఐపీఎల్ స్పాన్సర్లతో సంబంధాలు తెంచుకునే అవకాశం లేదని తెలిపారు. ఎగ్జిట్ నిబంధన ‘వివో’ కి అనుకూలంగా ఉంటే, 12 నెలలకు రూ .440 కోట్ల కాంట్రాక్టును బీసీసీఐ ఎందుకు రద్దు చేయాలి?... ఎగ్జిట్ నిబంధన మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దానిని రద్దు చేస్తాము అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వివో స్వయంగా ఒప్పందం రద్దు చేయాలి లేదా 2022 లో ముగిసే ఒప్పందాన్ని బోర్డు గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఐపీఎల్ అధికారుల సమావేశం పై "టి 20 ప్రపంచ కప్, ఆసియా కప్ యొక్క విధి మాకు ఇంకా తెలియదు, కాబట్టి మనం ఐపీఎల్ గురించి ఎలా సమావేశమవుతాము?" అని వాటి నిర్వహణ పై ఓ స్పష్టత వచ్చిన తర్వాత ఈ సమావేశాము జరుగుతుంది అని తెలిపారు.