2020 చివరి వరకు కరోనా ఎక్కడికి  పోదు... ఐపీఎల్ పోవాలి..

2020 చివరి వరకు కరోనా ఎక్కడికి  పోదు... ఐపీఎల్ పోవాలి..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మన దేశం లో కరోనా మహమ్మారిని ఈ ఏడాది చివరి వరకు లేదా 2021 ప్రారంభం వరకు భరించాల్సి ఉంటుందని, అందువల్ల భారత అభిమానులు కోరుకున్న ఐపీఎల్ ను బయటికి పంపాల్సి వస్తుంది అన్నారు.  ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో జరిగిన చాట్ సందర్భంగా భారతదేశంలోని కరోనా పరిస్థితిని ఆయన ఎలా చూస్తారనే ప్రశ్నకు గంగూలీ మాట్లాడుతూ... "రాబోయే మూడు నాలుగు నెలలు కొంచెం కఠినంగా ఉంటాయని నేను భావిస్తున్నాను, మనము ఈ వైరస్ ను భరించాల్సి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో, భారతీయుల జీవితం సాధారణ స్థితికి వస్తుంది అనుకుంటున్నాను. అయితే అప్పటివరకు మన దేశం నుండి కరోనా ఎక్కడికి పోదు కాబట్టి ఐపీఎల్ బయటకు పోవాల్సి వస్తుంది అన్నారు. ఇక ఈ కరోనా కు టీకా బయటకు వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి . అయితే వైరస్ కు మందు బయటకు వచ్చిన తర్వాత, ఇతర అనారోగ్యాల మాదిరిగానే ఇది మారి అంతా బాగానే ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం చివరి నాటికి మనమందరం బాగుండాలని ఆశిద్దాం" అని ఇండియా ఓపెనర్ అగర్వాల్‌ నిర్వహించిన కార్యక్రమంలో గంగూలీ అన్నారు.