బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానుల సమావేశం వాయిదా... ఎందుకంటే..?

బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానుల సమావేశం వాయిదా... ఎందుకంటే..?

కరోనా కారణంగా ఇప్పటికే ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై సందిగ్ధత ఈ రోజు మరింత పెరిగింది. బీసీసీఐ అలాగే ఐపీఎల్  ఫ్రాంచైజ్ యజమానులతో షెడ్యూల్ ప్రకారం ఈ రోజు జరగాల్సిన కాన్ఫరెన్స్ కాల్‌ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం లో కరోనా మహమ్మారి మధ్య ఐపీఎల్ ముందుకు వెళ్ళే మార్గం గురించి చర్చించాల్సి ఉంది.

మాకు మానవత్వం మొదట, మిగతావన్నీ రెండవ స్థానంలో ఉన్నాయి. మన దగ్గర పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడటంలో కూడా అర్థం లేదు. అందుకే నేను ఈ సమయంలో ఐపిఎల్ గురించి కూడా ఆలోచించలేను ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. కాని వారు తీసుకున్న చురుకైన చర్యలకు  వారిని మెచ్చుకోవాలి. భారతదేశం అన్ని విమానాలను నిలిపివేసింది అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా చెప్పారు. ఇలాంటి సమయంలో ఏదైనా చర్చించడంలో అర్థం లేదు. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఐపిఎల్ కంటే చాలా ముఖ్యమైన విషయాలను మేము పరిష్కరించుకోవాలి అని మరో ఫ్రాంచైజ్ యజమాని అన్నారు. అయితే ఏం జరుగుతుందో చూడాలి మరి.