ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత జట్టు...

ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత జట్టు...

జూలై నెలలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌ల కోసం టీంఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. విరాట్ కోహ్లీ సారధ్యంలో 15 మంది ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. ఐపీఎల్ లో చెన్నై తరపున విశేషంగా రాణిస్తున్న అంబటి రాయుడు భారత జట్టులో చోటు సంపాదించాడు. భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 3 నుంచి 8 వరకు టీ-20 సిరీస్‌.. జూలై 12 నుంచి 17 వరకూ వన్డే సిరీస్‌ జరుగనుంది.

టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్ ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, సిద్ధార్త్ కౌల్, ఉమేష్ యాదవ్.

వన్డే జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, సిద్ధార్త్ కౌల్, ఉమేష్ యాదవ్.