దుర్గగుడిలో క్షురకుల నిరసన

దుర్గగుడిలో క్షురకుల నిరసన

విజయవాడ దుర్గగుడిలో క్షురకులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. పది రోజుల క్రితం డబ్బులు తీసుకుంటున్నారని దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ఓ క్షురకుడిపై దాడి చేసాడు. ఈ నేపథ్యంలో దుర్గగుడిలో క్షురకులందరు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోక్యంతో అప్పట్లో శాంతి ధర్నాను విరమించారు. అయితే సమస్య పరిష్కారం కాకపోవటంతో ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు దుర్గగుడి క్షురకులు. దీంతో అమ్మవారిని దర్శనానికి వచ్చే భక్తులకు ఆటకం ఏర్పడింది.