అలర్ట్... నాలుగు రోజులు బ్యాంక్‌ల మూత...!

అలర్ట్... నాలుగు రోజులు బ్యాంక్‌ల మూత...!

నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ.. బ్యాంకు లావాదేవీల్లో జరిపే ఖాతాదారులంతా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది... ఎందుకంటే నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం మొదటి రెండ రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనుండగా.. ఆ తర్వాత పండుగ.. ఆ తర్వాత బ్యాంకుల సమ్మె, నాల్గో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు.. అంటే మొత్తంగా ఒకే వారంలో నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. ఇక, వివరాల్లోకి వెళ్తే... వచ్చేవారంలో సోమవారం, మంగళవారం బ్యాంకులు యథావిథిగా పనిచేయనుండగా.. ఇక, బుధవారం రోజు ఉగాది సందర్భంగా సెలువు.. మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా... బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో శుక్రవారం, నాల్గో శనివారం కావడంతో శనివారం, ఆ తర్వాత ఆదివారం ఇలా.. వచ్చేవారం 25వ తేదీ, 27, 28, 29 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు లావాదీలపై ఎక్కువగా ఆధారపడేవాళ్లు ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్.