ఎనిమిది రోజులు బ్యాంకుల‌కు సెల‌వు..!

ఎనిమిది రోజులు బ్యాంకుల‌కు సెల‌వు..!

క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించి లాక్‌డౌన్ల ప్ర‌క్రియ ముగిసింది.. ఇప్పుడు అన్‌లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.. ఇవాళ్లి నుంచి దేశ‌వ్యాప్తంగా అన్‌లాక్ 2.0 అమ‌ల్లోకి వ‌చ్చింది.. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు వెలుప‌ల కూడా కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు.. అయితే, కొన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు మాత్రం కంటైన్మెంట్ జోన్ల‌లో మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాయి.. కానీ, లాక్‌డౌన్‌తో బ్యాంకుల‌కు సంబంధంలేదు.. క‌ఠిన‌మైన ఆంక్ష‌లు కొన‌సాగిన స‌మ‌యంలోనూ బ్యాంకులు య‌థావిథిగా ప‌నిచేస్తూనే ఉన్నాయి.. కాక‌పోతే.. అక్క‌డ‌క్క‌డ‌.. బ్యాంకు సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డుతుండ‌డం.. ఆందోళ‌న క‌లిగిస్తోంది.. ఇక‌, జులై నెల‌లో మొత్తం ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు ప‌నిచేయ‌వు.

ఈ నెల‌లో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం.. ఇత‌ర సెల‌వులు క‌లుపుకుని.. మొత్తం 8 రోజులు బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. వివ‌రంగా ప‌రిశీలిస్తే.. జూలై 5న  ఆదివారం, 11న‌ రెండో శనివారం, 12న ఆదివారం, 19న‌ ఆదివారం, 20న తెలంగాణ‌లో బోనాల పండగ, 25న నాల్గో శ‌నివారం, 26న‌ ఆదివారం, 31న బ‌క్రీద్.. ఇలా మొత్తం జులై నెల‌లో ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు ప‌నిచేయ‌వు.. నిత్యం బ్యాంకు లావాదేవీల్లో ఉండేవాళ్లు.. ఈ సెల‌వుల‌ను గ‌మ‌నించి ముందుగానే త‌మ ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకోగ‌ల‌రు.