రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 30, 31న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతనాల సమీక్ష విషయంలో యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యుఎఫ్‌బియు), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఏ) మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సందర్భంగా ఉద్యోగుల వేతనాలను 2 శాతం మేర పెంచేందుకు ఐబిఏ ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కావని యుఎఫ్‌బియు తెలిపింది. దీంతో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు 48 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న సుమారు పది లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు