ఢిల్లీపై బెంగళూరు విజయం

ఢిల్లీపై బెంగళూరు విజయం

ఐపీఎల్-11లో భాగంగా ఫెరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు మొయిన్‌ అలీ(1), పార్థివ్‌(6)లు శుభారంభం ఇవ్వలేకపోయారు. ఈ దశలో కెప్టెన్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ఈ జోడి బౌండరీలు, సిక్సర్లతో స్కోరు  బోర్డును పరుగెత్తించారు. కోహ్లి(50; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్‌(50; 28 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)లు అర్ధసెంచరీలు చేశారు. ధాటిగా ఆడే క్రమంలో కోహ్లి(70) పెవిలియన్ చేరాడు. తర్వాత మన్‌దీప్‌(13), సర్ఫరాజ్‌(11)లు కూడా తక్కువ స్కోరుకే అవుట్ అయినా.. డివిలియర్స్‌(72) చివరి వరకు గ్రీజ్ లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్ బౌల్ట్‌ రెండు వికెట్లు తీశాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డివిలియర్స్‌ కి దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.