టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు

టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు

ఐపీఎల్-11లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. అద్భుత ఫామ్ లో ఉన్న సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గి ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వరుస పరాజయాలతో సతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలుపు తప్పనిసరి అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న సన్‌రైజర్స్ జట్టును ఎదుర్కోవాలంటే రాయల్ ఛాలెంజర్స్ కు తలకుమించిన భారమే.

జట్లు:

హైదరాబాద్: అలెక్స్ హేల్స్, శిఖర్ ధవన్, కేన్ విలియమ్‌సన్(కెప్టెన్), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా(కీపర్), భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్త్ కౌల్, సందీప్  శర్మ.

బెంగళూరు: పార్థీవ్ పటేల్(కీపర్), మనాన్ వోహ్రా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, కొలిన్ డి గ్రాండ్‌హోం, టిం సౌతీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, యుజవేంద్ర  చాహల్.