దేశ రాజకీయాల్లో ఇదో మలుపు...

దేశ రాజకీయాల్లో ఇదో మలుపు...

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఓ మలుపు అన్నారు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ... ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజాధరణ తగ్గుతోందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో కర్ణాటక ఫలితాలు... మోడీకి ప్రజాధరణ తగ్గలేదని నిరూపించాయన్నారు దత్తాత్రేయ. కర్నాటక ఎన్నికల ఫలితాలు 2019 సాధారణ ఎన్నికల ఫలితాలపైనా ప్రభావితం చూపుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తగలబోతోందని జోస్యం చెప్పారు బీజేపీ ఎంపీ. తెలుగు ప్రజలు... ఏపీ, తెలంగాణ సీఎంలకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించిన ఆయన... కుటుంబ పాలనకు అంతం తప్పదన్నారు. అనేక మంది హాంగ్ అని చెప్పిన కర్నాటక ప్రజలు బీజేపీకి పట్టంకట్టారన్నారు దత్తాత్రేయ.