తేజకు బాలయ్య రాయబారం!

తేజకు బాలయ్య రాయబారం!

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగాల్సివుండగా సడెన్ గా ఈ ప్రాజెక్ట్ ను తప్పుకున్నాడు దర్శకుడు తేజ. దీంతో ఎవరిని డైరెక్టర్ గా తీసుకుంటారనే విషయంలో సందిగ్దత నెలకొంది. క్రిష్, రాఘవేంద్రరావు ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ నేతృత్వంలో బాలయ్య డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు దర్శకుడు తేజను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 


అభిప్రాయబేధాల కారణంగా బాలయ్య, తేజ విడిపోయారని సమాచారం. కొందరు స్నేహితులు వీరిద్దరి మధ్య రాయబారం నడిపి సమస్యను సాల్వ్ చేశారట. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయడానికి తేజ కూడా సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుకానుందట. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొదటినుండి ఈ సినిమా స్క్రిప్ట్ తెలిసిన దర్శకుడు తేజ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేయగలడనేది పలువురి అభిప్రాయం. దీనికి సంబంధించి త్వరలోనే నిజానిజాలు తెలియనున్నాయి.