నాగార్జున తర్వాత బాలయ్యతో ఆ డైరెక్టర్ సినిమా...?

నాగార్జున తర్వాత బాలయ్యతో ఆ డైరెక్టర్ సినిమా...?

కింగ్ నాగార్జున ఈ మధ్యనే మన్మధుడు 2 తో వచ్చి భారీ ప్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అహిషోర్ సోలోమెన్ ద‌ర్శక‌త్వంలో  ‘వైల్డ్ డాగ్‌’ అనే సినిమా చేస్తున్నారు నాగ్. అయితే ప్రస్తుతం తీస్తున్న సినిమా తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రవీణ్ సత్తారు గరుడ వేగ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత తన రెండో సినిమాకు చాలానే సమయం పట్టింది. అందువల్ల తన రెండో  సినిమాకు తీసుకునంత గ్యాప్ మూడో సినిమాకు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడట! అందుకే నాగార్జున తో సినిమా పూర్తయిన వెంటనే నందమూరి నటసింహం బాలకృష్ణ తో సినిమా చేయనున్నాడట. ఇప్పటికే బాలయ్యతో సంప్రదింపులు  కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను బాలయ్య కమర్షియల్ ఫార్ములాకు విరుధంగా పూర్తి  వైవిధ్యమైన కథతో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న బాలయ్య, అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.